ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.ఇప్పుడు ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదని...103 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో పాలన నడుస్తోందన్నారు. ఎవరో ఏదో అన్నారని కాకుండా.. మా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు కేసీఆర్. అంతేకాదు..ఈ జరగబోయే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే మెజార్జీసీట్లు సాధిస్తుందన్నారు సీఎం కేసీఆర్. 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీనికోసం మా దగ్గర మంచి మత్రం ఉందన్నారు. ఇది నామాటగా వంద శాతం రాసుకోమని కూడా మీడియాను అన్నారు. అప్పుడు 8 నెలల ముందు అసెంబ్లీని డిజాల్వ్ చేశాం.. ఇప్పుడు ఆరునెలల ముందు క్యాండిడేట్లకు టికెట్లు అనౌన్స్ చేస్తాం..ఫరక్ ఏం పడదన్నారు కేసీఆర్.
మరిన్ని వార్తల కోసం...