బైక్ నడుపుతున్నప్పుడు చాలామందికి టైర్లో గాలి తక్కువగా ఉందేమో అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు పంచర్ షాప్‌కు వెళ్లి చెక్ చేసుకుంటే సరిగ్గానే ఉంటుంది. కొన్నిసార్లు తక్కువగా అనిపించకపోయినా తగ్గిపోతుంటుంది. అలా ఎయిర్ ప్రెజర్‌ని సరిగ్గా అంచనా వేయలేని వాళ్ల కోసమే ఈ గాడ్జెట్. ఈ టైర్ ప్రెజర్ చెకర్ని వన్లాప్ అనే కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీన్ని టైర్ నాజిల్‌కు కనెక్ట్ చేయగానే ప్రెజర్ డిస్‌ప్లే అవుతుంది. దీనికి జింక్ అల్లాయ్ మెటల్ హెడ్ - ఉండడం వల్ల లీకేజీ లేకుండా టైర్ నాజిల్‌కు సరిగ్గా ఫిక్స్ అవుతుంది.
ఈ గాడ్జెట్‌ని మన్నికైన మెటీరియల్‌తో తయారుచేశారు. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. చిన్నగా ఉండడంతో ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఇది బ్యాక్‌లిట్ ఎల్సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. పగటి పూట కూడా నెంబర్లు బాగా కనిపిస్తాయి. దీనిలోని సెన్సర్ ప్రెజర్‌ని చాలా ఆక్యురేట్‌గా మెజర్ చేస్తుంది. ఇది రెండు ఎల్ఆర్44 బటన్ బ్యాటరీలతో పనిచేస్తుంది. ఇందులో ఆటో పవర్ కట్ ఫీచర్ కూడా ఉంది. వాడకుండా పక్కన పెడితే 30 సెకన్లలో ఆటోమేటిక్‌గా షట్ డౌన్ అవుతుంది. ఇది బైక్‌లకే కాదు ట్రక్కులు, స్కూటర్లు కార్లు.. ఇలా అన్నింటికీ ఉపయోగపడుతుంది.
ధర:799 రూపాయలు
బ్రేక్ లైట్లు
సాధారణంగా బైక్ మీద వెళ్తున్నప్పుడు బ్రేక్ వేస్తే బ్యాక్ లైట్ వెలుగుతుంది. దాంతో వెనక వస్తున్న వెహికల్ డ్రైవర్ అలర్ట్ అవుతాడు. అయితే.. ఆ లైట్ చీకట్లో బాగానే కనిపిస్తుంది. కానీ.. డే టైంలో సరిగ్గా కనిపించదు. అందుకే అదనంగా ఇలాంటి బ్రేక్ లైట్లను బిగించుకుంటే సరిపోతుంది. ఈ లైట్లను రామంతా అనే కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇవి బైక్‌లో ఉండే బ్యాటరీతోనే పనిచేస్తాయి. వీటికి 12 వోల్ట్స్ డీసీ పవర్ సరిపోతుంది. బ్రేక్ వేయగానే ఈ లైట్లు ఫ్లాష్ అవుతాయి. వీటిని టర్న్ సిగ్నల్ లైట్లు, రివర్సింగ్ లైట్లు, కార్నర్ లైట్లు, పార్కింగ్ లైట్లలా కూడా వాడుకోవచ్చు. ఇందులో మూడు ఫ్లాషింగ్ ప్యాట్రెన్స్ ఉంటాయి. ఇన్స్టాల్ చేయడం కూడా ఈజీ.
రెండు లైట్ల ధర : 189 రూపాయలు
హ్యాండిల్ గార్డ్
వానాకాలంలో బైక్‌లు స్కిడ్ అవుతుంటాయి. బాడీ అంతటా కాకపోయినా చేతులు కాళ్లకు మాత్రం గాయాలు అవుతాయి. ఇలాంటి హ్యాండిల్ గార్డ్స్‌ని బిగించుకుంటే కనీసం చేతులనైనా కాపాడుకోవచ్చు. వీటిని ఒటోరాయ్స్ అనే కంపెనీ తీసుకొచ్చింది. వీటిని బిగించుకుంటే ముఖ్యంగా వేళ్లను కాపాడుకోవచ్చు. యమహా, సుజుకి, హీరో, హోండా లాంటి అన్ని బైక్‌లకు సరిపోతుంది. దీన్ని ప్లాస్టిక్, అల్యూమినియం అల్లాయ్‌తో తయారుచేశారు. ఇవి బిగిస్తే బైక్ లుక్ కూడా బాగుంటుంది.
డిస్క్ లాక్
పబ్లిక్ పార్కింగ్ జోన్లలో బైక్ పార్క్ చేసినప్పుడు ఎవరో ఒకరు బైక్‌ని పక్కకి జరుపుతుంటారు. దాని వల్ల చిన్న చిన్న డ్యామేజ్లు కూడా అవుతుంటాయి. కానీ.. ఇలాంటి డిస్క్లాక్లు వేస్తే బైక్ అడుగు కూడా జరగదు. దీన్ని వీల్‌కు ఉండే డిస్క్ రంధ్రాలకు ఎటాచ్ చేసి వేసుకోవచ్చు. దీనికి అలారం సిస్టమ్ కూడా ఉంది. బైక్‌ని ఎవరైనా కదిలిస్తే వెంటనే అలారం మోగుతుంది.
దీని అలారం110dB వరకు వినిపిస్తుంది. కాబట్టి దొంగలకు బైక్‌ని కొట్టేసే అవకాశం ఇవ్వదు.ఈ యాంటీ–థెఫ్ట్ డిస్క్ లాక్‌ని వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో తయారుచేశారు. కాబట్టి వానలో పార్క్ చేసినా సమస్య ఉండదు. హై సెక్యూరిటీ యాంటీ-డ్రిల్ లాక్ కోర్ ఉండడం వల్ల లాక్‌ని పగులగొట్టడం, కట్ చేయడం లాంటివి చేయలేరు. ఈ లాక్‌లో ఇన్‌బిల్ట్ షాక్ సెన్సర్ ఉంది. ఇది వైబ్రేషన్లు, కదలికలను గుర్తించగలదు.
ధర : 729 రూపాయలు