ఇదో రకం ముఠా:చిన్న పిల్లలను ఎంగేజ్ చేసుకొని..సెల్ఫోన్ల చోరీ చేయిస్తున్నారు

ఇదో రకం ముఠా:చిన్న పిల్లలను ఎంగేజ్ చేసుకొని..సెల్ఫోన్ల చోరీ చేయిస్తున్నారు

హైదరాబాద్: తీగలాగితే డొంకంతా కదిలినట్లు..దొంగను విచారిస్తే భయంకరమైన నిజాలు బయటికి వచ్చాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సెల్ ఫోన్ కేసును లోతుగా విచారించిన పోలీసులు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మొత్తం 9మందిని అరెస్టు చేశారు పోలీసులు. మొత్తం ఆరుగురు సభ్యుల ముఠా ఈ సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతోంది. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే.. వీరికి ముగ్గురు పోలీసు శాఖకు చెందినవారు సాయం చేయడం.. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే హోంగార్డ్, కానిస్టేబుల్ సోమన్న, సైఫాబాద్ పీఎస్ కానిస్టేబుల్ సాయిరాంలుగా గుర్తించారు. 

వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన విషయాలను వెల్లడించారు. జూలై 23,2024న సెల్ ఫోన్ స్నాచింగ్ కేసు నమోదు అయింది. ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ అధికారి సెల్ ఫోన్ దొంగిలించేందుకు  వెస్ట్ బెంగాల్ కు చెందిన అమీన్ ఘాజీ అనే దొంగ ప్రయత్నించాడు. ఓ ప్రయాణికుడు ఘాజీని పట్టుకుని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి రిమాండ్ కుతరలించారు. 

ఘాజీని విచారించగా ఆరుగురు సభ్యుల ముఠా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలింది. వీరికి స్థానిక గాంధీనగర్ పోలీసులు సహకరిస్తున్నట్లు విచారణ తెలిసింది. పోలీసులు కూడా తమ నేరాన్ని ఒప్పుకున్నారు. 

పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ కు చెందిన ఆరుగురు సభ్యులు ఓ ముఠాగా ఏర్పడి ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. అంతేకాదు.. వీరు పిల్లలను ఎంగేజ్ చేసుకొని దొంగతనాలు చేయిస్తున్నారు.. అరెస్టయిన 9మందిలో 12 యేళ్ల బాలుడు కూడా విశేషం. ముఠా సభ్యుల గత నేరచరిత్రపై లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ కావడం బాధాకరం.. నేరస్తులతో చేతులు కలిపితే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని  వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ అన్నారు.

వ్యవస్థీకృత నేరాలు పాల్పడుతున్న నిందితులకు ఈ ముగ్గురు పోలీసులు సహకరించారు.. అంతకుముందు సెల్ఫోన్ స్నాచింగ్ చేసిన మొబైల్స్ అన్నిటినీ ఝార్ఖండ్ కు పంపించారు.. జార్ఖండ్ కు ఒక టీమును పంపించాం.. దేశంలో ఎక్కడెక్కడ దొంగతనాలకు పాల్పడ్డారు.. ఆయా రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకొని కేసు లోతైన విచారణ చేస్తామన్నారు డీసీపీ. సెల్ఫోన్ దొంగతనాలను పోలీస్ శాఖ చాలా సీరియస్ గా తీసుకుంటుందన్నారు. సెల్ ఫోన్ పోగొట్టుకున్న వాళ్ళు సీఐఆర్ లో నమోదు చేసుకోవాలన్నారు వెస్ట్ జోన్ డీసీసీ విజయ్ కుమార్.