బూంరాంగ్ అంటే ఇదే : పెళ్లాం మెడలో దండేయరా అంటే.. కాళ్లపై పడ్డాడు

ఇండియన్ మ్యారేజెస్ అంటే చాలా హడావిడి, సంప్రదాయాలు ఉంటాయి. ఎన్నో ఆచారాలు, కట్టుబాట్ల మధ్య ఎంతో పద్దతిగా జరుగుతుంది. అందులో కొన్ని ఉల్లాసంగా జరిగితే.. మరికొన్నేమో హైలైట్‌ అవుతూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా దానికి సంబంధించిందే. వధూవరులు పూల దండలు మార్చుకోవాల్సిన సమయంలో జరిగిన ఓ ఫన్నీ సన్నివేశం ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

ALSOREAD:ఏం తెలివులురా : పెద్ద కారులో వచ్చి.. కోడి గుడ్ల లారీ ఎత్తుకెళ్లిన దొంగలు

ఈ వీడియోలో వరుడు, వధువు దండలు మార్చుకోవడానికి సిద్దంగా నిల్చుని ఉన్నారు. అందరూ ఆ వేడుకను చూస్తుండగా.. అంతలోనే పెళ్లి కొడుకు వెనక ఉన్న ఓ వ్యక్తి అతన్ని.. పెళ్లి కూతురు మాల వేయకుండా వరుడిని సరదాగా పైకి ఎత్తాడు. కానీ ఇక్కడే ఊహించని ఓ ట్విస్ట్ తో అందరూ కడుపుబ్బా నవ్వడం మొదలుపెట్టారు. పెళ్లి కొడుకును పైకెత్తే క్రమంలో పట్టు కోల్పోవడంతో.. వధువుపై పడబోయాడు. ఈ వీడియోకు నెటిజన్లు కూడా ఫన్నీ వేలో స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

pic.twitter.com/xFZWMsEtIy

— Poet Uncle? (@poetuncle) July 11, 2023