తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ, ఇంగ్లీష్..ఇలా భాషతో సంబంధం లేకుండా ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని ప్రేక్షకులను అలరిస్తే మరికొన్ని నిరాశపరుస్తాయి. ఇక ఈ శుక్రవారం (నవంబర్ 22న) థియేటర్లోకి రాబోయే కొత్త సినిమాలు ఏంటీ? వాటి నేపథ్యమేంటి? అన్నది చూద్దాం.
మెకానిక్ రాఖీ:
విశ్వక్ సేన్ హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెకానిక్ రాకీ’. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జెక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు. టీజర్, ట్రైలర్ చూస్తుంటే యాక్షన్‍తో ఎంటర్‌టైనింగ్‍గా ఈ మూవీ రానున్నట్లు తెలుస్తోంది.
దేవకి నందన వాసుదేవ:
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. వారణాసి మానస హీరోయిన్. ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సోమినేని బాలకృష్ణ నిర్మించారు.
ALSO READ | బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకెళ్తోన్న క్రేజీ బ్యూటీ..
శ్రీకృష్ణుడి పుట్టుక మేనమామ కౌంసుడి మరణానికి కారణం అయినట్లు, ఈ సినిమాలో హీరో పుట్టుక అతడి మేనమామకు ప్రాణ గండం కానుందంటూ ట్రైలర్ లో పూజారి చెప్పే డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఇంతకీ మేనల్లుడు, మేనమామ మధ్య వివాదం ఎక్కడ మొదలవుతుంది? వంటి ఆసక్తికర అంశాలతో.. మురారి తరహాలో దైవ కోణంతో ఉన్న కుటుంబ కథగా ఈ మూవీ తెరకెక్కిన్నట్లు తెలుస్తోంది.
జీబ్రా::
సత్యదేవ్, డాలీ ధనంజయ లీడ్ రోల్స్‌లో డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ రూపొందించిన చిత్రం ‘జీబ్రా’. ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించారు. నవంబర్ 22న సినిమా రిలీజ్ కానుంది. బ్యాంకింగ్ జానర్, మనీ లాండరింగ్, కామెడీ, లవ్, ఫ్రెండ్‌షిప్, యాక్షన్ నేపధ్యంగా ఈ మూవీ తెరెకెక్కింది.
కేసీఆర్::
జబర్దస్త్’ షోతో కమెడియన్‌గా గుర్తింపును తెచ్చుకున్న రాకింగ్ రాకేష్ ‘KCR’ (కేశవ చంద్ర రమావత్) సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ‘గరుడ వేగ’ అంజి దర్శకుడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ కానుంది.
కథ విషయానికి వస్తే..
రిలీజైన ట్రైలర్‌లో కేశవ చంద్ర రమావత్...షార్ట్‌కట్‌లో కేసీఆర్ అని 90'S వెబ్ సిరీస్ చైల్డ్ యాక్టర్ ఆదిత్య చెబుతూ కనిపించాడు. ఛోటా కేసీఆర్ అని ఓ ముసలమ్మ పిలవగానే రాకింగ్ రాకేష్‌ను చూపించారు. ఇక చిన్నప్పటి నుంచి కలిసి తిరిగి, ప్రేమను పెంచుకున్న బావమరదళ్ల ప్రేమకథకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఊరి కోసం పల్లెను విడిచి కేసీఆర్ సిటీకి ఎందుకు వెళ్లాల్సివచ్చిందన్నది ట్రైలర్ లో ఎమోషనల్‌గా చూపించారు.
ఇక ఊరు పోతుందంటే ఊపిరి పోయినట్లుగా ఉందని.. పల్లెప్రజలకు తమ ఊరితో ఉన్న మమకారాన్ని...ఊరు విడిచివెళ్లాల్సివచ్చినప్పుడు వారు ఎదుర్కొనే బాధను కేసీఆర్ ట్రైలర్‌లో డైరెక్టర్ అంజి ఎమోషనల్గా చూపించారు. ఇకపోతే ఈ సినిమాలో రాకింగ్ రాకేశ్ హీరో మాత్రమే కాదు..నిర్మాత కూడా.. ఎలాంటి హిట్ అందుకోనున్నాడో చూడాలి మరి.
ఇక ఈ సినిమాలతో పాటు రోటి కపడా రొమాన్స్, సన్నీలియోన్ మందిర, త్రిగుణ్ ఉద్వేగం వంటి సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి.