నలిమెల భాస్కర్‌కు కాళోజీ అవార్డ్
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త నలిమెల భాస్కర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం-2024కు ఎంపిక చేసింది. రూ.1,01,116 నగదుతో పాటు పురస్కారం ప్రదానం చేయనుంది.
పీఏసీ చైర్మన్‌గా గాంధీ
శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా అరికెపూడి గాంధీ, ఎస్టిమేట్స్ కమిటీకి ఉత్తమ్ పద్మావతి, ప్రజా పద్దుల సంఘం చైర్మన్‌గా వీర్లపల్లి శంకరయ్య నియమితులయ్యారు.
అగ్ని-4 బాలిస్టిక్ మిస్సైల్ సక్సెస్
అగ్ని-–4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ పరీక్షను ఒడిశాలోని చండీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించింది. 4వేల కిలోమీటర్ల దూరంలోని శత్రులక్ష్యాలను ఛేదించగల కెపాసిటీ అగ్ని-4 మిస్సైల్ సొంతం.
బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్
ప్రపంచవ్యాప్తంగా ది బెస్ట్ కంట్రీగా స్విట్జర్లాండ్ మరోసారి ఘనతను సొంతం చేసుకుంది. 89 దేశాల్లో యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ 2024లో వరుసగా మూడోసారి టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. భారత్ గతేడాదితో పోల్చితే మూడు స్థానాలు దిగి 33వ స్థానంలో ఉంది.
ప్రపంచంలో తొలి న్యూక్లియర్ క్లాక్
ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్‌ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పరమాణువు కేంద్రకం నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారా ఈ గడియారం పనిచేస్తుంది.
ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ టాప్
ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే టాప్‌లో ఉందని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో ఏటా 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. తర్వాతి స్థానాల్లో నైజీరియా, ఇండోనేసియా, చైనా ఉన్నాయి.

దళవాయి శివమ్మ
భారత ప్రభుత్వం అందించే ‘శిల్పగురు’ అవార్డు శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన తెలుగు కళాకారిణి దళవాయి శివమ్మను వరించింది. కేంద్ర జౌళి శాఖ నిర్వహించే శిల్పగురు, జాతీయ చేతి వృత్తుల అవార్డు-2023 పోటీలకు తోలుపై అద్భుతంగా రూపొందించిన శ్రీకృష్ణ చరిత, ఏడు అడుగుల ఎత్తైన విశ్వరూప హనుమాన్ కళాఖండాలను ఆమె పంపించారు.
అమిత్ షా
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా అధికార భాషా పార్లమెంటరీ కమిటీ 2019 నుంచి అమిత్ షా 2024 వరకు పనిచేశారు. 1976 రాజ్యసభకు చెందిన 30 మంది సభ్యులతో ఉంటుంది.