ట్రంప్‍పై కాల్పులు చేసిన యువకుడి వివరాలు వెల్లడించిన FBI

ట్రంప్‍పై కాల్పులు చేసిన యువకుడి వివరాలు వెల్లడించిన FBI

అమెరికాలో శనివారం మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు జరిగాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను FBI ఆదివారం వెల్లడించింది. సబర్బన్ పిట్స్‌బర్గ్‌కు చెందిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ నర్సింగ్‌హోమ్ లో ఉద్యోగం చేసేవాడు. ట్రంప్ ప్రచారంలో మాట్లాడుతున్నప్పుడు క్రూక్స్ గన్ తో కాల్చాడు. ట్రంప్ కు త్రుటిలో బుల్లెట్ తప్పి, ర్యాలీకి వచ్చిన వ్యక్తికి తగిలి చనిపోయాడు.

ALSO READ | ట్రంప్ పై కాల్పులు జరిపింది ఇతనే.. 20 ఏళ్ల కుర్రోడు ఎందుకిలా చేశాడు..?

వెంటనే యాక్టివ్ అయిన సీక్రేట్ సర్వీస్ అతన్ని కాల్చి చంపాయి. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ (FBI) సంస్థ షుటర్ వివరాలు వెల్లడించింది. క్రూక్స్ అతని ఇంటి నుంచి కారులో పేలుడు పదార్థులు వేసుకోని కాల్పులు జరగడానికి గంట ముందు బయలుదేరాడని తెలిపింది. క్రూక్స్ ట్రంప్ పై కాల్పులు జరపడానికి అతని తండ్రి తుపాకీ ఉపయోగించాడని వివరించారు. ఇంతకు ముందు అతనిపై ఎలాంటి క్రై హిస్టరీ లేదని తెలిపారు. క్రూక్స్ 2022లో బెతెల్ పార్క్ హైస్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు. అతను వాడింది AR స్టైల్ రైఫిల్.. అది అతని తండ్రి కొన్నాడు.

ALSO READ | ట్రంప్‌ను షూట్ చేసిన వీడియో వైరల్ : చెవికి గాయం