German football: 14 ఏళ్ళ కెరీర్‌కు గుడ్ బై.. అంతర్జాతీయ ఫుట్ బాల్‌కు జర్మన్ స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్

యూరో కప్ 2024 లో జర్మనీ పోరాటం క్వార్టర్-ఫైనల్ లో ముగిసింది. స్పెయిన్ పై క్వార్టర్స్ లో 1-2 తేడాతో ఓడిపోయింది. దీంతో జర్మనీ స్టార్ ప్లేయర్ థామస్ ముల్లర్ తన అంతర్జాతీయ ఫుట్ బాల్ కెరీర్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. యూరో టోర్నీ ముగిసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా సోమవారం (జూలై 15) అతను అంతర్జాతీయ ఫుట్ బాల్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు తన నిర్ణయాన్ని తెలియజేశాడు. 

జర్మనీ జట్టులో ముల్లర్ అటాకింగ్ మిడ్‌ఫీల్డర్. 14 ఏళ్లుగా జట్టులో కొనసాగిన అతను.. 2014 ఫిఫా వరల్డ్ కప్ జర్మనీ గెలిచిన జట్టులో సభ్యుడు. జర్మనీ జట్టులో టోని క్రూస్ ఇటీవలే అంతర్జాతీయ ఫుట్ బాల్ కు రిటైర్మెంట్ కు ప్రకటించాడు. దీంతో జర్మనీ ఇద్దరు స్టార్ ఫుట్ బాల్ ఆటగాళ్ల సేవలను కోల్పోనుంది. "నా దేశానికి ఆడినందుకు గర్వంగా ఉంది. నా ప్రయాణంలో నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. 2026 ఫిఫా వరల్డ్ కప్ కు అందుబాటులో ఉండడం లేదు. ఫుట్ బాల్ అభిమానిగా ఎంజాయ్ చేస్తాను". అని ముల్లర్ అన్నారు. 

ముల్లర్ మార్చి 2010లో జర్మనీ తరపున అరంగేట్రం చేశాడు. 2010 ఫిఫా వరల్డ్ కప్ లో ఐదు గోల్స్ తో గోల్డెన్ బూట్ అవార్డు తో పాటు..   ఫిఫా యంగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. ప్రపంచ కప్‌లో ముల్లర్ జర్మనీ తరపున 19 మ్యాచ్ ల్లో 10 పది గోల్స్ చేశాడు. ఇటీవలే జరిగిన యూరోలో ముల్లర్ ఒక్క గోల్ కూడా చేయలేదు. ఓవరాల్ గా జర్మనీ తరపున 131 మ్యాచ్ ల్లో 45 గోల్స్ చేశాడు.