కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ థామ్సన్ నియో సిరీస్ ల్యాప్ టాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ఇంటెల్ కోర్ ఐ3, ఐ5, ఐ7 12వ జనరేషన్ ప్రాసెసర్లను అమర్చారు. స్టూడెంట్లకు, ప్రొఫెషనల్స్‌కు ఇవి అనువుగా ఉంటాయని థామ్సన్ తెలిపింది.
ఎక్కువ వేగం, మల్టీ టాస్కింగ్ కెపాసిటీ ఈ ల్యాప్‌టాప్‌ల ప్రత్యేకతలని తెలిపింది. వీటి ధరలు రూ.15 వేల నుంచి మొదలవుతాయి. ఈ ల్యాప్‌టాప్‌లను ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు.