ప్రైవేట్​ స్కూళ్లలో బుక్స్​ అమ్మొద్దు

ప్రైవేట్​ స్కూళ్లలో బుక్స్​ అమ్మొద్దు

తొర్రూరు, వెలుగు : ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ యూనిఫామ్స్, ఇతర స్టేషనరీ సామాన్లు విక్రయాలు నిలిపివేయాలని కోరుతూ తొర్రూర్ బుక్స్​స్టేషనరీ వ్యాపారులు శనివారం మహబూబాబాద్ డీఈవో రామారావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గంజి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో

పుస్తకాలు విక్రయాల వల్ల ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్టేషనరీ వ్యాపారులు శోభన్, ఉప్పలయ్య, వెంకట్, సూరిబాబు, వసంత్ చారి తదితరులు పాల్గొన్నారు.