తొర్రూరు ఎస్‌‌‌‌బీఐ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం

తొర్రూరు ఎస్‌‌‌‌బీఐ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం

తొర్రూరు, వెలుగు : మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులోని ఎస్‌‌‌‌బీఐ బ్రాంచ్‌‌‌‌లో ఆదివారం షార్ట్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌ కారణంగా మంటలు అంటుకున్నాయి. దీంతో కంప్యూటర్లు, ఫైల్స్, ఫర్నీచర్‌‌‌‌ దగ్ధమైంది. ఆదివారం బ్యాంక్‌‌‌‌కు సెలవు అయినప్పటికీ కొందరు ఉద్యోగులు వచ్చి పెండింగ్‌‌‌‌ వర్క్‌‌‌‌ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ టైంలో షార్ట్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌ కావడంతో రెండు కంప్యూటర్స్‌‌‌‌ నుంచి పొగలు వచ్చి ఒక్కసారిగా మంటలు లేచాయి. 

దీంతో అలర్ట్‌‌‌‌ అయిన బ్యాంక్‌‌‌‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. తొర్రూరు సీఐ జగదీశ్‌‌‌‌, ఎస్సై ఉపేందర్, సిబ్బంది బ్యాంక్‌‌‌‌ వద్దకు చేరుకొని మంటలను ఆర్పేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది బ్యాంక్‌‌‌‌ వద్దకు చేరుకున్నారు. మంటల్లో నాలుగు కంప్యూటర్లు, కొన్ని ఫైల్స్, కంప్లైంట్‌‌‌‌ బాక్స్‌‌‌‌, ఫర్నీచర్‌‌‌‌ దగ్ధమైందని బ్యాంక్‌‌‌‌ సిబ్బంది తెలిపారు. విషయం తెలుసుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి బ్యాంక్‌‌‌‌ వద్దకు వచ్చి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.