పీడీఎస్​ బియ్యం పట్టివేత

తొర్రూరు, వెలుగు : ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్​ బియ్యాన్ని తొర్రూరు పోలీసులు పట్టుకున్నారు. దుబ్బతండ వద్ద పోలీసులు వాహనాలు తనీఖీ చేస్తుండగా అటుగా వచ్చిన లారీని చెక్​ చేశారు. దాంట్లో 24.5 టన్నుల పీడీఎస్​ బియ్యాన్ని గుర్తించారు. మహబూబాబాద్ నుంచి మరిపెడ హైవే రోడ్డులో మహారాష్ట్ర కు తరలిస్తున్నారని డ్రైవర్ మనోజ్ ధర్మదాస్ గులాడే చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.