చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

తొర్రూరు, వెలుగు : విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తొర్రూరు జూనియర్ సివిల్​ కోర్టు జడ్జి మట్ట సరిత తెలిపారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు.

ఈ సందర్భంగా జడ్జి సరిత మాట్లాడుతూ ఉచిత న్యాయ సేవలపై విద్యార్థులకు వివరించారు. అనంతరం చదువులో ప్రతిభ చూపిన విద్యార్థినులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ శైలజ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.