తొర్రూరు, వెలుగు : అభివృద్ధిలో తొర్రూరు మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా నని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తెలిపారు. 3m బుధవారం స్థానిక మున్సిపల్ ఆఫీస్లో మున్సిప ల్ చైర్మన్ రామచంద్రయ్య అధ్యక్షతన సాధారణ సమావేశంలో ఎమ్మెల్యేయశస్వినిరెడ్డి మాట్లాడా రు. అభివృద్ధి పనులపై కౌన్సిలర్లు, అధికారులతో చర్చించారు. తాగునీటి కోసం అభివృద్ధి పనుల కోసం ప్రతి వార్డుకు రూ 7లక్షల కేటాయించిన ట్లు తెలిపారు. ఇప్పటికే వార్డుల్లోరూ 62 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. అనంతరు పట్టణంలోని రైతు వేదికలో పీఏసీఎస్
ALSO Read : అన్ని అంగన్వాడీల్లో టాయిలెట్స్ నిర్మిస్తాం: భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్
చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక మహాజన సభలో మాట్లాడా రు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషన్ శాం తకుమార్, వైస్ చైర్మన్ సురేందర్రెడ్డి, కౌన్సిలర్లు కర్నె నాగజ్యోతి నాగరాజు, చకిలేల అలివేలు, తూనం రోజా, భూసాని రాము, తూర్పాటి సంగీత గజానంద్ పాల్గొన్నారు.