నోటా దాటని ఆ రెండు జాతీయ పార్టీలు.. బీఎస్పీ, సీపీఎంలకు ఓటెయ్యడానికి ఇష్టపడని ఓటర్లు

నోటా దాటని ఆ రెండు జాతీయ పార్టీలు.. బీఎస్పీ, సీపీఎంలకు ఓటెయ్యడానికి ఇష్టపడని ఓటర్లు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ ), సీపీఎం పార్టీలకు ఓటెయ్యడం కంటే నోటా మీటను నొక్కడానికే ఓటర్లు ఇష్టపడ్డారు. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం.. నోటాకు 0.57 శాతం ఓట్లు వచ్చాయి. బీఎస్పీకి 0.55 శాతం, సీపీఎంకు 0.01 శాతం ఓట్లు పడ్డాయి.  

సీపీఐకి 0.01 శాతం, జేడీయూకు 0.53శాతం ఓట్లు వచ్చాయి. ఢిల్లీలో1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 94,51,997 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 60.54 శాతం ఓటింగ్ నమోదైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ లో (ఈవీఎం) 2013లో నోటాను ప్రవేశపెట్టారు. పోటీలో ఉన్న అభ్యర్థులెవ్వరూ తమకు నచ్చని పక్షంలో దీనిని ఉపయోగించుకోవచ్చు.