ఇసుక మస్తు పిరం !.. సామాన్యులకు అందుబాటులో లేని రేట్లు

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : కొత్తగా ఇండ్లను నిర్మించుకునేవారికి ఇసుక దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా కొత్త క్వారీలు ఓపెన్‌‌‌‌‌‌‌‌ కాకపోవడం.. మరో వైపు ఇసుకకు డిమాండ్‌‌‌‌‌‌‌‌ పెరగడంతో కొందరు వ్యాపారులు బ్లాక్‌‌‌‌‌‌‌‌ చేసి రేట్లు పెంచేశారు. స్థానిక అవసరాలకు వాగుల నుంచి ఇసుకను ఫ్రీగా తీసుకోవచ్చని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. దీంతో రోజురోజుకు ఇసుక రేట్లు పెరిగిపోతుండడంతో బ్లాక్‌‌‌‌‌‌‌‌లో కొనలేక ఇండ్ల నిర్మాణాలను ఆపేస్తున్నారు.

పెరిగిన డిమాండ్ కారణంగా.. 

భూపాలపల్లి జిల్లాలో కొత్తగా13 క్వారీలకు టెండర్లు పిలిచారు. ఇంకా ఓపెన్ కాలేదు. ములుగు జిల్లాలో మూడు క్వారీలు మాత్రమే నడుస్తున్నాయి. దీంతో ఇసుకకు భారీగా డిమాండ్‌‌‌‌‌‌‌‌  పెరిగింది. ఇదే అదునుగా వ్యాపారు లు బ్లాక్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌కు తరలిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో దొడ్డు ఇసుక టన్ను రూ. 1,200 నుంచి రూ. 1,500 పలుకుతుండగా, సన్న ఇసుక రేట్లను అమాంతం పెంచేశారు. రూ. 1,500పైగా చెల్లిస్తే తప్ప టన్ను సన్న ఇసుక దొరకడం లేదు. 

 వాగుల వద్దకు వెళ్తే కేసుల నమోదు

గ్రామాల్లో కొత్త ఇండ్లను నిర్మించుకుంటే ఇసుక కొరత రాకుండా సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి సర్కార్‌‌‌‌‌‌‌‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు గత మార్చి 23న ఉచిత ఇసుక స్కీమ్‌‌‌‌‌‌‌‌ను అమల్లోకి తెచ్చింది. స్థానిక అవసరాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఫ్రీగా తీసుకునేలా అనుమతించాలని ఆదేశిం చింది. దీంతో రాష్ట్ర మైన్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ జియాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్‌‌‌‌‌‌‌‌ దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు. కానీ సర్కార్‌‌‌‌‌‌‌‌ ఆదేశాలను జిల్లాల్లోని ఆఫీసర్లు పట్టించుకోవడంలేదు. పైరవీకారులు మాత్రమే ఇసుక తీసుకెళ్లేలా అధికారులు అనుమతులు ఇస్తున్నారు. లారీ ఓనర్లు, ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ యజమానులే పర్మిషన్‌‌‌‌‌‌‌‌ తెచ్చుకొని ఇసుకను డంపింగ్‌‌‌‌‌‌‌‌ చేసుకుంటున్నారు. దీంతో సామాన్యులకు ఇసుక దొరకట్లేదు. ఒకవేళ ఇసుక కావాలని వాగుల వద్దకు వెళ్తే ట్రాక్టర్లను సీజ్‌‌‌‌‌‌‌‌ చేయించి కేసులు పెడుతున్నారు.

బ్లాక్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న వ్యాపారులు

రాష్ట్రంలో ఇసుక రేట్లు తగ్గాలంటే గోదావరి క్వారీలు అందుబాటులోకి రావాలి. ప్రస్తుతం భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కేవలం ఆరు క్వారీలు మాత్రమే ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాలో కొత్తగా 13 క్వారీలకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయి. అయినా.. ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రభుత్వ ఇసుక క్వారీల నుంచి తక్కువ మొత్తంలో బయటకు వస్తోంది. క్వారీ యజమానులే బ్లాక్‌‌‌‌‌‌‌‌ చేసి మార్కెట్ లో అమ్ముతుండడంతో రేట్లు అమాంతం పెరిగిపోయాయి. దీనిపై సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు నియంత్రణ లేకుండా పోతుంది.

క్వారీల వద్ద టన్నుకు ప్రభుత్వం రూ.375 మాత్రమే తీసుకుంటుంది. వ్యాపారులు 30 టన్నుల లారీకి ప్రభుత్వానికి రూ.11,250 చెల్లించి, మార్కెట్ లో రూ.36 వేలకు అమ్ముతున్నారు. మరోవైపు కొందరు వ్యాపారులు మైనింగ్‌‌‌‌‌‌‌‌ పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఉన్న రీచ్‌‌‌‌‌‌‌‌ల నుంచే కాకుండా లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాగుల నుంచి కూడా దొంగతనంగా ఇసుకను తీసుకొచ్చి అమ్ముతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తమకు తెలిసిన ఆఫీసర్ల సాయంతో పేదలకు ఉచిత ఇసుక స్కీమ్ పర్మిషన్‌‌‌‌‌‌‌‌ రాకుండా అడ్డుకుంటున్నారని పేర్కొంటున్నారు.  

కొత్త క్వారీలు ఇంకా ఓపెన్ కాలేదు 

భూపాలపల్లి జిల్లాలో కొత్త ఇసుక క్వారీలు ఇంకా మొదలుకాలేదు. పాత క్వారీల్లో ఇసుక అయిపోయింది. గోదావరి నుంచి ఇసుక తోడి ఒడ్డుకు తీసుకురావడానికి సమయం  పడుతుంది. దీంతో షార్టేజ్‌‌‌‌‌‌‌‌ ఏర్పడింది. అందుకే ఇసుక రేట్లు పెరిగాయి.
- నారం సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అంబట్‌‌‌‌‌‌‌‌పల్లి, మహదేవ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ మండలం, 
భూపాలపల్లి జిల్లా