ఓయూ, వెలుగు: ఓయూలో విద్యార్థి నాయకులపై దాడికి పాల్పడిన ఏబీవీపీ లీడర్లను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. యూనివర్సిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థి నాయకులు శ్రీకాంత్, చందును బుధవారం వారు పరామర్శించారు. అనంతరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పరామర్శించిన వారిలో ప్రజా ఉద్యమ నాయకురాలు విమలక్క, ప్రొఫెసర్ పురుషోత్తం ఇటిక్యాల, చన్నగాని దయాకర్, మానవతరాయ్ తదితరులు ఉన్నారు. అలాగే మద్యం మత్తులో గణనాథుల ధ్వంసానికి కుట్ర చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి ఓయూ ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు.