విగ్రహాలు ధ్వంసం చేసినవారిని కఠినంగా శిక్షించాలి

ఆసిఫాబాద్, వెలుగు: మంచిర్యాల జిల్లా కోట పల్లి మండలంలోని బోరంపల్లిలో మహనీ యులు మహాత్మా జ్యోతిబాపూలే , సావిత్రిబాయి పూలే విగ్రహాలను ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆసిఫాబాద్ కేంద్రంలో అంబేద్కర్ చౌక్ వద్ద మాలి సంక్షేమ సంఘం ఎమ్మార్పీఎస్, దళిత  బహుజన సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.

ఈసందర్భంగా నాయకులు నాగోసే శంకర్, రేగుంట కేశవరావు మాదిగ, దుర్గం తిరుపతి, గుర్నులే మెంగాజీ మాట్లాడుతూ.. మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయడం హేయమైన చర్య అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, విగ్రహాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.