రాములును చంపిన వారిని వదలం.. చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తం

రాములును చంపిన వారిని వదలం.. చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తం

నస్రుల్లాబాద్,వెలుగు: కాంగ్రెస్ ​లీడర్​రాములును హత్య చేసిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని, శిక్షపడేలా చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణా రావు స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్​మండలం నాచుపల్లిలో బీఆర్ఎస్​లీడర్ల దాడిలో మృతి చెందిన రాములు కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రాములు కుటుంబం మంత్రి ముందు తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు.

పాత కక్షలు మనసులో పెట్టుకొని రాములును చంపేశారని కంటతడి పెట్టారు. తమకు సైతం ప్రాణహాని ఉందని, రక్షించాలని వేడుకున్నారు. దీంతో మంత్రి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గ ఇన్​చార్జ్​ఏనుగు రవీందర్​రెడ్డి..రాములు కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు. కాంగ్రెస్​ లీడర్లు ప్రతాప్​సింగ్,​ నందు పటేల్, అరిగె సాయిలు, విఠల్, వెంకన్న ఉన్నారు.