కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనపై దేశం మొత్తం ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వారికి చట్టం ఎలాంటి శిక్ష విధించినా గరుడపురాణంలో అత్యంత భయంకరమైన శిక్షలున్నాయి. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటన ఈ దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది.
ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తున్నాయి. ఆగస్టు 9 ఉదయం కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ హాల్‌లో ట్రైనీ డాక్టర్ మృతదేహం కనిపించింది. ఆమెను అత్యాచారం చేసి హత్యచేశారని వైద్యుల ప్రాధమిక నివేదికలో తేలింది. ఈ ఘటనలో కోల్ కతాలో ట్రాఫిక్ పోలీస్ వాలంటీర్ సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64(అత్యాచారం) 103/1(హత్య) కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులను త్వరగా పరిష్కరిచాలని, వైద్యులకు భద్రత కల్పించాలన దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులు భారీగా ఆందోళనలు చేశారు. అసలు ఇలాంటి వారికి గరుడ పురాణం ప్రకారం ఎలాంటి శిక్షలున్నాయో తెలుసా..
మనిషి రోజు రోజుకీ మృగంలా మారిపోతున్నాడు...చివరకు మృగం కూడా సిగ్గుపడేలాంటి ఘటనలు దేశంలో జరుగుతున్నాయి. మృగానికి కేవలం ఆకలి వేసినప్పుడే వేటాడుతుంది కానీ మనిషికి ఆ పరిమితులు, పరిధులు ఉండడం లేదు. అడ్డూ అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారిని ఏం చేయాలి? ఎలాంటి శిక్షలు వేయాలి? ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు. అయేషా ఘటన... నిర్భయ ఘటన.. దిశ ఘటన.. ఇప్పుడు కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ ఇవన్నీ వెలుగులోకి వచ్చిన ఘటనలు.. ఇక ప్రపంచానికి తెలియకుండా ఉన్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి అకృత్యాలకు పాల్పడిన వారికి ఇక్కడ చట్టం శిక్ష విధించినా... లేక.. సాక్షాలు తారు మారుమారు చేసి తప్పించుకున్నా.. మరణించిన తరువాత తప్పకుండా శిక్షించబడతారని గరుడ పురాణంలో ఉందని పండితులు చెబుతున్నారు. ఎలాంటి కోర్టులు ఉండవు.. ఎలాంటి వాదోపవాదనలు ఉండవు .. అక్కడ ఎలాంటి సాక్షాలు అవసరం లేదు..... భూలోకంలో తప్పు చేసి.. ఇక్కడ తప్పించుకున్నా... పైలోకంలో శిక్ష అనుభవించి తీరాల్సిందే...
అత్యాచారాలు చేసేవారికి గరుడ పురాణం ప్రకారం శిక్షలివే....
పుయోదకం : పురుషులు లేదా మహిళలు ఎవరైనా..ఎవర్నైనా అత్యాచారం చేసినా, లైంగికంగా వేధించినా నరకంలో విధించే శిక్ష ఇది. ఒక పెద్ద బావిలో మలం, మూత్రం, రక్తం, శ్లేష్మం నింపి అందులో ఆ వ్యక్తులను పడేస్తారు. వాళ్లు ఎప్పటికీ ఆ బావిలోనే ఉండిపోవడమే.
సల్మని : నరకంలో విధించే శిక్షల్లో సల్మని ఒకటి. వివాహేతర సంబంధాలు పెట్టుకునే స్త్రీ, పురుషులకు విధించే శిక్ష పేరు సల్మలి. బాగా వేడిగా అగ్నికణంలా ఉన్న ఓ ఇనుప స్తంభాన్ని నగ్నంగా కౌగిలించుకోమని చెప్పి యమభటులు కొరడాలతో కొడుతుంటారు.
లలాభక్షం : అత్యాచారానికి పాల్పడే వారికి మాత్రమే కాదు..స్త్రీలను కామంతో చూసేవారికి కూడా నరకంలో శిక్షలు మామూలుగా ఉండవు. ఇలాంటి వారికి విధించే శిక్ష లలాభక్షం. ఈ శిక్షలో భాగంగా కుళ్లిపోయిన వీర్యంతో నిండిన సముద్రంలో పడేస్తారు.
వజ్రకంఠకసలి: లైంగిక వాంఛ తీర్చుకునేందుకు చిన్నారులను, స్త్రీలను మాత్రమే కాదు చివరకు జంతువులను కూడా వదలడం లేదు. ఇలాంటి వారికి నరకంలో విధించే శిక్షే వజ్రకంఠసలి. సూదుల్లా ఉన్న పెద్ద లోహాలను శరీరంలోకి గుచ్చి వాటితో మనిషిని అమాంతం పైకిలేపి గాల్లో వేలాడదీసి శరీరాన్ని ఛిద్రం చేస్తారు.
అష్టాదశ పురాణాలలో గరుడ పురాణం ఒకటి. శ్రీ మహావిష్ణువు గరుక్మంతుడికి చెప్పిన విషయాలను వేద వ్యాసుడు రచించాడు. మనిషి మరణించినప్పటి నుంచి ఆత్మ ప్రయాణం ఎలా సాగుతుంది..ఎక్కడెక్కడ తిరుగుతుంది..పాపం చేస్తే ఎలాంటి శిక్షలు అనుభవిస్తారు..పుణ్యం చేస్తే ఎక్కడకు వెళతారు అవన్నీ వివరంగా ఉంటాయి. కేవలం చావుకి సంబంధించి మాత్రమే కాదు ..మనిషి పుట్టుక నుంచి ఆచరించిల్సిన సంస్కారాల గురించి కూడా గరుడపురాణంలో ఉంది... మరి అఘాయిత్యాలకు... అకృత్యాలకు పాల్పడే వారు భయంకరమైన శిక్షలు అనుభవించాల్సి తీరాల్సిందే..తస్మాత్ జాగ్రత్త. . . .