ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం.. హాజరుకాని  కేసీఆర్

ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం.. హాజరుకాని  కేసీఆర్

ఏపీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభమైంది.  గుంటూరు ఆటోనగర్‌ వద్ద ఏఎస్‌ కన్వెన్షన్‌ హాల్‌ వెనుక భాగంలో ఐదంతస్తుల కొత్త భవనంలో ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు.  దులో భాగంగా ఆదివారం (మే21) గుంటూరులో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ఆఫీసును ఏపీ బీఆర్‌ఎస్‌ చీఫ్‌ తోట చంద్రశేఖర్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. ఏపీ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏపీలో కూడా బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తోన్నారు.  వచ్చే  ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీకి అభ్యర్థులను దింపాలని భావిస్తున్నారు.

మొత్తం ఐదు అంతస్థులు

ఏపీ బీఆర్ఎస్ కార్యాలయంలో  మొత్తం 5 అంతస్థులు ఉన్నాయి.  మొదటి అంతస్థులో కార్యకర్తలతో సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. రెండు మూడు అంతస్థుల్లో పరిపాలన విభాగాలను సిద్ధం చేశారు. అలాగే పార్టీ కార్యకర్తలు, అతిధులు కూర్చోనే విధంగా విశాలమైన స్థలంలో హాలు ఏర్పాటు చేశారు. కాగా 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పార్టీ కార్యాలయాన్ని సిద్ధం చేశారు. ఇకపై పార్టీ కార్యక్రమాలు ఇక్కడి నుంచే జరగనున్నాయని ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు తోట చంద్రశేఖర్‌ తెలిపారు. 

 జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే మహారాష్ట్రలో దూకుడుగా వెళుతోంది. అక్కడ వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్‌. ఇక తర్వాత మధ్యప్రదేశ్‌లో కూడా అడుగుపెట్టే యోచనలో బీఆర్‌ఎస్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీలోనూ దూకుడుగా ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగానే గుంటూరులో పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటుచేసింది