అందరికీ ఆరు గ్యారంటీలు అందిస్తాం : లక్ష్మీకాంత్​రావు

పిట్లం,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అర్హులందరికీ అందేలా చూస్తానని జుక్కల్​ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్​రావు పేర్కొన్నారు. సోమవారం జుక్కల్ లో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు.

 ఎమ్మెల్యే తోట మాట్లాడుతూ జుక్కల్​ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలవడానికి కృషి చేసిన ప్రతీ కార్యకర్తను గుర్తుపెట్టుకుంటానన్నారు. అనంతరం పూజలు చేసి ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో జుక్కల్​ కాంగ్రెస్ ​నాయకులు పాల్గొన్నారు.