- సొంత నిధులతో రోడ్లని.. ఇప్పుడు బిల్లులకు యత్నిస్తుండు
ఘట్ కేసర్, వెలుగు: ఓట్ల కోసం సొంత నిధులతో రోడ్లు వేస్తున్నట్లు ఎన్నికల ముందు ప్రకటించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి గెలిచిన తర్వాత బిల్లుల వసూళ్లకు పాల్పడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి తోటకూర వజ్రేశ్ యాదవ్ ఆరోపించారు. ఘట్ కేసర్ వైస్ ఎంపీపీ కర్రె జంగమ్మ పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రయానికి ఆదివారం ఆయన హాజరయ్యారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమాన్ని మరిచి దోపిడీ, కబ్జాలకు పాల్పడ్డారన్నారు. ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టి గెలిచిన మల్లారెడ్డి తర్వాత నాటకాలు ఆడుతున్నారని ఫైరయ్యారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మల్లారెడ్డి పంపిణీ చేయకుండా తానే కలెక్టర్‌తో చెప్పి వాయిదా వేయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.