దొంగ హామీలతో దోచుకోవాలని చూస్తున్నరు : బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : దొంగ హామీలతో రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ మళ్లీ దోచుకోవాలని చూస్తున్నారని ఆలేరు కాంగ్రెస్ క్యాండిడేట్ బీర్ల అయిలయ్య విమర్శించారు. యాదాద్రి జిల్లా గుండాల, రాజాపేట , ఆత్మకూర్ , బొమ్మలరామారం, ఖాజీపేట, ఆలేరుతో పాటు పలు గ్రామాలకు చెందిన వెయ్యి మంది బీఆర్ఎస్ నాయకులు ఆదివారం యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి అయిలయ్య కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఆలేరు సహా రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేయబోతుందని, కాంగ్రెస్ గెలుపును ఆపడం ఎవరితరం కాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, ఎంపీపీ గందమల్ల అశోక్, మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు పాల్గొన్నారు.