వేల కోట్లు బకాయిలు పెట్టి..  ఇప్పుడు బుకాయిస్తే ఎట్ల?

వేల కోట్లు బకాయిలు పెట్టి..  ఇప్పుడు బుకాయిస్తే ఎట్ల?
  • అప్పుల వారసత్వానికి ఆద్యులే బీఆర్ఎస్ ​నేతలు: మంత్రి సీతక్క
  • ప్రతి శాఖ‌‌లోనూ రూ.వంద‌‌ల కోట్లపైనే బ‌‌కాయిలు
  • కేటీఆర్ ట్వీట్​కు మంత్రి కౌంటర్

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో ఓ వైపు రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసి.. చేసిన ప‌‌నుల‌‌కు బిల్లులు చెల్లించ‌‌కుండా రూ.వేల కోట్లు బ‌‌కాయిలు పెట్టారని మంత్రి సీతక్క ఫైర్​ అయ్యారు. రూ.5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్​మెంట్ బ‌‌కాయిలు, ఆరోగ్య శ్రీ, కాంట్రాక్టర్లకు, సర్పంచుల‌‌కు, విద్యుత్ సంస్థలకు, ఆర్టీసీకి, గురుకుల భ‌‌వ‌‌నాల ఓన‌‌ర్లకు అద్దెలు, ఉద్యోగుల‌‌కు రిటైర్మెంట్ బెనిఫిట్స్.. ఇలా ప్రతి శాఖ‌‌లోనూ రూ.వంద‌‌ల కోట్లపైనే బ‌‌కాయిలు పెట్టి.. ఇప్పుడు బుకాయిస్తే ఎలా? అని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్​ను​మంత్రి ప్రశ్నించారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని మంత్రి సీతక్క అన్నారు. అప్పుల వారసత్వానికి ఆద్యులు బీఆర్ఎస్​ నేతలేనని మంత్రి ఫైర్​ అయ్యారు. బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ట్వీట్​కు బుధవారం మంత్రి సీతక్క కౌంటర్​ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పులకు కిస్తీలు, వడ్డీల కోసం ప్రతిరోజు టంచ‌‌న్ గా  రూ.207 కోట్లు  చెల్లించాల్సి వస్తోందన్నారు. ప్రతినెలా స‌‌గ‌‌టున రూ.6 వేల కోట్ల ప్రజాధనాన్ని వారు చేసిన అప్పుల కుప్పను కడగడానికే స‌‌రిపోతోందన్నారు. అప్పుల అప్పారావులాగా అందిన కాడల్లా అప్పులు చేసి.. రాష్ట్రాన్ని తిప్పలు పెట్టి, వడ్డీలతో ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచిన మిమ్మల్ని దేనితో కొట్టాలని నిలదీశారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వ నిర్వాకంతో గాడి త‌‌ప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ వస్తున్నామన్నారు. ఇందిర‌‌మ్మ ఇండ్లు, కొత్త రేష‌‌న్ కార్డులు, ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప‌‌థ‌‌కాల‌‌కు శ్రీకారం చుట్టిందన్నారు. మీరు అప్పులు, బ‌‌కాయిలు, హామీల గురించి నీతులు చెప్పడం దయ్యాలు వేదాలు వ‌‌ళ్లించిన‌‌ట్టేనని కేటీఆర్​ట్వీట్​కు మంత్రి సీతక్క కౌంటర్​ ఇచ్చారు.