ఇండోనేషియాలో అగ్నిపర్వతాల బీభత్సం: సునామీ వచ్చే అవకాశం

ఇండోనేషియా దేశంలో ప్రకృతి విపత్తులు ప్రయళతాండవం చేస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలోనే 5సార్లు పలు అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందాయి. సులవేసి ద్వీపానికి ఉత్తరాన ఉన్న స్టాటోవోల్కానో మౌంట్‌ రువాంగ్‌ అగ్నిపర్వతం గురువారం బద్దలైంది. దీంతో కిలోమీటర్ల మేర లావా ఏరులై పారుతున్నాయి. ఆ దేశ జియోలాజికల్‌ ఏజెన్సీ అక్కడ సునామీ కూడా వచ్చే అవకాశం ఉందని అధికార యంత్రాంగాన్నిహెచ్చరించింది. వెంటనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్‌ చేసింది.


రుయాంగ్ అగ్నిపర్వతం నుంచి చుట్టుపక్కల నివసించేవారిని ఆరు కిలోమీటర్లు దూరంగా వెళ్లాలని అధికారులు ఆదేశించారు. అగ్ని పర్వతం విస్ఫోటనం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగ, బూడిద, చిన్న చిన్న రాళ్లు ఎగిసిపడుతున్నాయి. అగ్ని పర్వాతాలు పోలి కొంత భాగం సముద్రంలోకి కూలిపోయింది. దీంతో సునామీ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ ప్రాంతంలోని జనావాసాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని దాదాపు 11 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారందరినీ సులవేసి ద్వీపంలోని మనాడోకు సమీప నగరానికి పడవల ద్వారా తరలిస్తున్నారు.

indonesia, volcano, tsunami warning, evacuated, Volcano Erupts,Thousands Evacuated As Indonesia,indonesia news,v6news,telugulatestnews,teluguviralnews,Tsunami Threat to indonesia