సీఎం ఆశీస్సులతో కామారెడ్డికి వేలకోట్ల నిధులు

భిక్కనూరు, వెలుగు: భిక్కనూరు మండల కేంద్రంలో   రూ. 27 కోట్ల 87లక్షల 90 వేలతో చేపట్టిన  సీసీరోడ్లు, సంఘ భవనాలు,  డ్రైనెజీలతో పాటు పలు  పనులను ఆదివారం ప్రభుత్వ విప్​ గంపగోవర్ధన్​ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ  కామారెడ్డి నియోజకవర్గంలో  రూ. వేల కోట్లతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు.  

కామారెడ్డి  నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్​ మళ్లీ అధికారంలోకి రాగానే  సీదరామేశ్వర మహాక్షేత్రం మరో యాదాద్రిని తలపించేలా అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో  టౌన్​ సర్పంచ్​ తునికి వేణు, టెంపుల్​ చైర్మెన్​ అందె మహేందర్​ రెడ్డి, ఎంపీపీ గాల్​రెడ్డి, జడ్పీటీసీ  పద్మ, పార్టీ మండలాధ్యక్షుడు నరసింహారెడ్డి,ఎంపీటీసీలు చంద్రకళ రాములు, ప్రభాకర్, బాబు పాల్గొన్నారు.