జైనూర్, వెలుగు: సద్గురు పులాజీ బాబా సమాధి మహోత్సవాన్ని బుధవారం జైనూర్లోని పాట్నపూర్ సిద్ధేశ్వర సంస్థాన్‌లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్జిల్లా నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తులతో సిద్ధేశ్వర ఆలయం కిటకిటలాడింది. ధ్యాన కేంద్రంలో భజనలు చేశారు. మహిళలు పులాజీ బాబా సమాధి వద్ద మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. సంస్థాన్ అధ్యక్షుడు కేశవ్ ఇంగ్లే, వైస్ ప్రెసిడెంట్ వామన్ రావు ఇంగ్లే, ఇంద్రవెల్లి ఎంపీపీ శోభ, సర్పంచ్ కేంద్రే బాలాజీ, సంస్థాన్ సభ్యులు పాల్గొన్నారు.