కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు

కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు

కొమురవెల్లి, వెలుగు: మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే కోనేరులో స్నానమాచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి మండపంలో బారులు తీరారు. అనంతరం గంగరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టింది. అనంతరం మల్లన్న గుట్టపైన కొలువైన రేణుక ఎల్లమ్మకు, నల్ల పోచమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయవర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి.