కన్నుల పండువగా బాలేశ్వరుడి రథోత్సవం

కన్నుల పండువగా బాలేశ్వరుడి రథోత్సవం

ఆసిఫాబాద్ - వెలుగు : రథ సప్తమిని పురస్కరించుకొని మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్ద వాగు ఒడ్డున బాలేశ్వరుడి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. వేడుకల్లో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పల్లకి సేన నిర్వహించి, అనంతరం రథోత్సవం నిర్వహించారు. ఆసిఫాబాద్ జడ్జి అనంతలక్ష్మి, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.