భక్తులతో కిటకిటలాడుతున్న యాదగిరిగుట్ట

తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదగిరి గుట్టకు ఆదివారం(నవంబర్ 10) భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడం, అందునా కార్తీకమాసం తొలివారం కావడంతో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఆదివారం పెద్దఎత్తున తరలివచ్చారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 

సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. స్వామి వారి ఉచిత ప్రవేశ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం  పడుతోంది. దాంతో, భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు.