
శంకర్పల్లి, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్గ్రామంలోని వీరన్న చెరువులో సోమవారం వేలాది చేపలు మృత్యువాత పడ్డాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని వీరన్న చెరువులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చేప పిల్లలను ముదిరాజ్మత్స్య సహకార సంఘం పెంచుతోంది. అయితే చెరువులోని చేపలన్నీ ఉన్నట్టుండి చనిపోయాయి. విషవాయువు లేదా చెరువులో విష రసాయనాలు కలవడం వల్లే మృతిచెందినట్లు అనుమానిస్తున్నారు. చెరువులోని చేపల విలువు సుమారు రూ.5లక్షల వరకు ఉంటుందని, తమ జీవనాధారానికి గండి పడిందని మత్స్య సహకార సంఘం వారు బోరుమంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.