వాషింగ్టన్ ప్రాంతంలో తీవ్ర వర్షం కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ ప్రభావం దాదాపు 1.1మిలియన్ల ప్రజలపైనా పడింది. మొత్తంగా వడగళ్లు, మెరుపులతో అమెరికాలోని చాలా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ సందర్భంగా నేషనల్ వెదర్ సర్వీస్ అలర్ట్ జారీ చేసింది. రేటర్ D.Cలో వరద హెచ్చరిక చేసింది. హరికేన్ గాలుల వల్ల తీవ్రంగా ముప్పు ఉందని, దాంతో పాటు వడగళ్ళు, బలమైన సుడిగాలులు కూడా వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. తుఫాను వ్యాప్తి ప్రభావం భారీగా ఉండడంతో టేనస్సీ నుంచి న్యూయార్క్ వరకు 10 రాష్ట్రాలలో అధికారులు సుడిగాలి హెచ్చరికలు జారీ చేశారు. వాషింగ్టన్-బాల్టిమోర్ ప్రాంతంలోని ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
ALSO READ :ఇదే కరెక్ట్.. కొట్టినా.. తిట్టినా పడి ఉంటదిలే : బొమ్మను పెళ్లి చేసుకున్న యువకుడు..
ఇక ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ FlightAware ప్రకారం, ఆగస్టు 7 మధ్యాహ్నం నాటికి, సుమారు 15వందల U.S. విమానాలు రద్దయ్యాయి. 7వేల కంటే ఎక్కువ విమానాలు ఆలస్యంగా బయల్దేరాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్.. తూర్పు తీరానికి వెళ్లే విమానాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపింది. ఇక చెట్లు మీదపడి, పిడుగుపాటుకు గురైన ఘటనల్లో ఇద్దరు మృతి చెందినట్టు సమాచారం. దీని వల్ల 11లక్షల ఇళ్లు, వ్యాపారాలకు విద్యుత్ సదుపాయం కొరత ఏర్పడింది.