
ట్రంప్ కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్ అమెరికాలోని భారతీయులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. డిపెండెంట్ వీసాపై ఉన్న వారిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ట్రంప్ కొత్త వలసవిధానంతో ఇప్పటికే గుర్తింపులేని కొంతమంది భారతీయులను ఇండియాకు పంపించినప్పటికీ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్లకే అసలు సమస్య. ఎటు పోవా ల్నో తెలియని గందర గోళంలో ఉన్నారు. కొందరు కెనడా వంటి ఇతర దేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మరికొందరు ఇండియా బాటపడుతున్నారు. పాత ఇమ్మిగ్రేషన్ రూల్స్కి, కొత్తవాటికి తేడా ఏంటీ..కొత్త రూల్స్తో అమెరికాలో ఉన్న భారతీయుల సమస్యలు ఏంటీ..? వివరాల్లోకి వెళితే..
ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వివిధ దేశాలకు చెందిన వలసదారులను గుర్తించి సొంత దేశాలకు పంపించారు. కొందరు అక్కడి జైళ్లలోనే ఉన్నారు. ట్రంప్ కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్ భారతీయులపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దఫాలుగా అమెరికాలో ఉన్న గుర్తింపు లేని ఇండియన్స్ ని గుర్తించి స్వదేశానికి పంపించారు. అయితే ఇప్పుడు సమస్య అంతా అక్కడున్న భారతీయుల దుస్థితి.
Also Read :- రూ.6 కోట్ల వజ్రాలు కొట్టేసి మింగేసిన దొంగ
మార్చి 2023 నాటికి దాదాపు 1.34 లక్షల మంది భారతీయ పిల్లలు H4 వీసాపై అమెరికాలో నివసిస్తున్నారు. వీరికి 21యేళ్లు నిండిన వెంటనే డిపెండెంట్ వీసానుంచి పర్మినెంట్ వీసా (గ్రీన్ కార్డు) కు మారాల్సి ఉంటుంది. శాశ్వత నివాసం కోసం చాలా కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. కొన్ని దరఖాస్తులకు 12నుంచి 100యేళ్లు కూడా పట్టే అవకాశం ఉంది.
దీంతోపాటు 21 ఏళ్లు నిండిన తర్వాత డిపెండెంట్ స్టేటస్ కోల్పోయే వారితో సహా, డాక్యుమెంట్లు లేని యువతకు బహిష్కరణ నుంచితాత్కాలికంగా రెండేళ్లరక్షణను అమెరికా DACA అందిస్తుంది. అయితే ఇప్పుడు ఈ నిబంధనను తొలగించారు. దీంతో చాలా మంది భారతీయ యువత భవిష్యత్తు గురించి భయపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు కెనడా లాంటి ఇతర దేశాల బాటపడుతున్నారు. మరికొందరు అన్ని సర్దుకుని ఇండియాకు పయనమవుతున్నారు.