కుంభమేళాలో మూడో అమృత స్నానం.. హెలికాప్టర్​ నుంచి పూల వర్షం

కుంభమేళాలో మూడో అమృత స్నానం.. హెలికాప్టర్​ నుంచి పూల వర్షం

వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని మహా కుంభమేళాలో మూడొవ అమృత స్నానాన్ని భక్తులు.. సాధువులు  చేశారు. ఉత్తర్ ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో భాగంగా సోమవారం ( ఫిబ్రవరి 3)  తెల్లవారుజామున 3.30 గంటలకే  అఖాడాలు మూడొవ 'అమృత్ స్నాన్'ని ప్రారంభించారు. గత అమృత స్నానం రోజున తొక్కిసలాట జరిగి 30 మంది మరణించిన విషయం తెలిసిందే. 

మూడవ అమృత స్నానానికి ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కుంభమేళాకు సాధువులతో పాటు భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో ఇసుకేస్తే రాలనంత జనం ప్రయాగ్‌రాజ్‌లో కనిపిస్తున్నారు. తెల్లవారుజామున, సాధువులు , వివిధ అఖారాల నుండి బూడిద పూసిన నాగులతో సహా, త్రివేణి సంగమం వైపు వారి ఉత్సవ యాత్రను ప్రారంభించారు.
 
 పవిత్ర దినంగా భావించే వసంతపంచమి రోజున నిర్వహించే అమృత స్నానాలకోసం ప్రతి అఖాడాకు సమయం కేటాయించారు. ఒక్కో అఖాడాకు 40 నిమిషాల సమయం నిర్ణయించారు. తొలి ఊరేగింపుగా వెళ్లే సాధువులు వారి పనులు ముగించుకొని నిర్ణిత సమయంలో వారివారి శిబిరాలకు వెళ్లిపోయేలా షెడ్యూల్‌ ను నిర్ణయించారు. 

ALSO READ : లోక్ సభలో గందరగోళం.. కుంభమేళా తొక్కిసలాటపై చర్చకు విపక్షాల పట్టు

సాధువులు ఊరేగింపుగా వెళ్లి పవిత్ర స్నానాలు ఆచరించి సోమవారం మధ్యాహ్నం 3 గంటల 55 నిమిషాలలోపు తిరిగి వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. వారు వెళ్లిన తర్వాత సాధారణ ప్రజలకు పవిత్ర స్నానాలు చేసే అవకాశాన్ని కల్పిస్తారు. అయితే చాలామంది భక్తులు సంగం వద్దే అమృతస్నానం చేయాలనే ఉద్దేశంతో భారీగా చేరుకుంటున్నారు. గత మౌని అమావాస్య రోజు అక్కడే తొక్కిసలాట జరిగింది. అయితే సంగం వద్దే స్నానాలు ఆచరించాలనే నియమం ఏమీ లేదని ఎక్కడ చేసిన అదే పుణ్యం లభిస్తు్ందని సాధువులు, అధికారులు స్పష్టం చేస్తు్న్నారు.

అమృత్​ స్నానం చేయడానికి ముందు ఓ సాధువు  మీడియాతో మాట్లాడుతూ  వసంత పంచమి రోజున ( ఫిబ్రవరి 3) ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చేస్తుందని.. కుంభమేళాలో సంతరించుకున్న ఆధ్యాత్మిక విలువలను పరిశీలిస్తుందన్నారు. ఫిబ్రవరి 3 ఉదయం 6 గంటల సమయంలో , అఖారాలలో మొదటివారు తమ స్నానాన్ని పూర్తి చేశారని, జునా అఖారాతో సహా ఇతరులకు ప్రక్రియ సజావుగా జరుగుతుండగా, ఈ కార్యక్రమంలో నాగాలు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయని అధికారులు తెలిపారు.  హెలికాప్టర్‌ని ఉపయోగించి ఆ ప్రాంతంలో గులాబీ రేకుల వర్షం కురిపించిన దృశ్యాలు కనిపించాయి.

#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP | A Naga sadhu says, "Arrangements today were better than the previous two Amrit Snans... Today's snan was the biggest for us saints..." pic.twitter.com/n1OPYfYw34

— ANI (@ANI) February 3, 2025

35 కోట్లమంది పుణ్యస్నానాలు

సోమవారం  (ఫిబ్రవరి 3) తెల్లవారుజామున 4 గంటల సమయానికి 16.58 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కాగా కుంభమేళా ప్రారంభమైన నాటినుంచి సోమవారం నాటికి పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 34.97 కోట్లకు చేరుకుంది. వీరిలో 10 లక్షల మంది కల్పవాసీలు, 6.58 లక్షల మంది యాత్రికులు ఉన్నారు. ఇప్పటివరకు 33 కోట్ల మంది భక్తులు మహా కుంభమేళాలో స్నానమాచరించారు.