థ్రెడ్స్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఖాతాలను విడిగా డిలిట్ చేయొచ్చు.. క్రియేట్ చేయొచ్చు..

థ్రెడ్స్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఖాతాలను విడిగా డిలిట్ చేయొచ్చు.. క్రియేట్ చేయొచ్చు..

థ్రెడ్స్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై థ్రెడ్స్ యాప్ ను ఇనస్టాల్ చేయాలన్నా.. డిలిట్ చేయాలన్నా ఇన్ స్టాగ్రామ్ తో సంబంధం లేకుండా ప్రత్యేక ఫీచర్ ను అందుబాటులోకి తెస్తోంది సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా. ప్రస్తుతం యూజర్ వారి థ్రెడ్ అకౌంట్ ను తొలగించాలనుకుంటే అది వారి మొత్తం ఇన్ స్టాగ్రామ్ ఖాతాను కూడా తొలగించాల్సి ఉండేంది. ఈ పరిమితిపై యూజర్లు ఆందోళన లేవనెత్తడంతో మెటా ఈ నిర్ణయం తీసుకుంది. 

Also Read : Good Health : ఇలా తింటే.. రోగాలు లేకుండా 100 ఏళ్లు బతుకుతారు

థ్రెడ్ ఖాతాలను విడిగా తొలగించడం అనేది సాంకేతిక పరంగా ఓ సవాల్.. ఫెడివర్స్ అనే నెట్ వర్క్ ద్వారా దీనిని అధిగమించేందుకు మేం కృషి చేస్తున్నాం..కొత్త ఫీచర్ ను 2023 డిసెంబర్ నాటికి  అందుబాటులోకి తెస్తామని టెక్ క్రంచ్ డిస్ రప్ట్ ఈవెంట్ లో మెటా చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ మిచెల్ ప్రోటీ చెప్పారు. మొత్తం కంటెంట్ ను సేవ్ చేయడం, ఖాతాను డిలిట్ చేయడం, వ్యక్తిగత థ్రెడ్ లను ఎంపిక చేయడం వంటివి వాటిని కొత్త ఫీచర్ ఈజీగా చేసుకోవచ్చని మిచెల్ ప్రోటీ తెలిపారు. థ్రెడ్స్  సేవలను వినియోగదారులకు మరింత సులభం చేసే యత్నంలో భాగంగా కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు మిచెల్ పేర్కొన్నారు.  ఇన్ సైడర్ ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం.. 2023 చివరి నాటికి యూఎస్ లో 23.7 మిలియన్ల యాక్టివ్ యూజర్లను కలిగి ఉంటుందని అంచనా.