రాజస్థాన్‌‌‌‌ సీఎంకు బెదిరింపు కాల్.. జైలు నుంచి ఫోన్ చేసిన ఖైదీ

రాజస్థాన్‌‌‌‌ సీఎంకు బెదిరింపు కాల్.. జైలు నుంచి ఫోన్ చేసిన ఖైదీ

న్యూఢిల్లీ: రాజస్థాన్  సీఎం భజన్‌‌‌‌లాల్‌‌‌‌ శర్మను చంపేస్తామని బెదిరింపు కాల్‌‌‌‌ వచ్చింది. ఆ ఫోన్​ కాల్​ జైలు నుంచి ఓ  ఖైదీ చేసినట్టు పోలీసులు గుర్తించారు.  పోక్సో కేసులో అరెస్టయిన రింకు అనే వ్యక్తి డౌసా జైలులో ఉన్నాడు. శనివారం అతను ఓ ఫోన్​నుంచి సెక్యూరిటీ వింగ్​కు ఫోన్​ చేసి సీఎంను చంపేస్తానంటూ బెదిరించాడు. దీనిపై అలర్ట్​ అయిన సిబ్బంది దర్యాప్తు చేపట్టారు.

ఆ ఫోన్​ కాల్​ డౌసా జైలు నుంచి రింకు అనే వ్యక్తి చేసినట్టు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతడికి ఫోన్​ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై వివరాలు రాబడుతున్నారు. అయితే, బెదిరింపు కాల్​ చేసిన వ్యక్తికి జైలు సిబ్బంది సహకరించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.