7జీ బృదావనకాలనీ(7G Brundavancolony) ఫేమ్ సోనియా అగర్వాల్(Sonia agarwal) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ 7జీ(7G). హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు 7జీ అనే టైటిల్ పెట్టడం ఇప్పుడు వివాదంగా మారింది. అంతేకాదు ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టొదంటూ బెదిరింపు కాల్స్ కూడా చేస్తున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో.. నటి శ్రుతి, వెంకట్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 7జీ. సోనియాఅగర్వాల్ దెయ్యం పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు హారూన్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి 7జీ టైటిల్ ను నిర్ణయించడంతో ఈ చిత్ర దర్శకుడికి బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయట. ఇదే విషయం గురించి దర్శకుడు హారూన్ మాట్లాడారు.
7జీ సినిమా దెయ్యాల కాన్సెప్ట్ తో రూపొందుతున్న హర్రర్ మూవీ. 7జీ అనే రూమ్ లో ఈ సినిమా కథ నడుస్తుంది కాబట్టి ఈ సినిమాకు 7జీ అనే టైటిల్ నిర్ణయించాము. అంతేకాదు.. 7జీ అనే టైటిల్‌ను కూడా ఎవరు రిజిస్టర్ చేయించలేదు. అందుకే మా చిత్రానికి ఆ టైటిల్ పెట్టాము. అయితే మా చిత్రానికి ఈ పేరు పెట్టకూడదని కొందరు కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. కానీ మా సినిమాకు టైటిల్ మార్చే ప్రసక్తే లేదు, చట్టపరంగా ఎదుర్కొవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు హరూన్. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లనుందో చూడాలి మరి.