
జూబ్లీహిల్స్, వెలుగు: సోషల్మీడియాలో తమకు పబ్లిసిటీ కల్పిస్తానంటూ వచ్చిన వ్యక్తి తమను చంపుతానంటూ బెదిరిస్తున్నాడని ఎమ్మెల్సీ విజయశాంతి భర్త ఎంవీ శ్రీనివాస ప్రసాద్ బంజారాహిల్స్పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగేండ్ల కింద ఎం.చంద్రశేఖర్రెడ్డి అనే వ్యక్తి కంటెంట్ క్రియేటర్ పేరుతో తమని సంప్రదించాడని, రాజకీయ, వ్యాపార రంగాల్లో పబ్లిసిటీ కల్పిస్తాననడంతో అంగీకరించామన్నారు.
అయితే ఆయనతో ఎటువంటి ఒప్పందం చేసుకోలేదన్నారు. తాము బీజేపీలో ఉన్నప్పుడు పరిచయమయ్యాడని, కంటెంట్నచ్చకపోవడంతో కొన్నాళ్ల తర్వాత ఆయన సేవలను వినియోగించుకోవడం ఆపేశామన్నారు. కాగా, తాజాగా పెండింగ్బిల్లులు క్లియర్చేయకపోతే చంపేస్తానంటూ మెసేజ్పంపాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయశాంతి ఎమ్మెల్సీ అయ్యాక బెదిరింపులు రావడంపై అనుమానం వ్యక్తం చేశారు.