సల్మాన్​ ఖాన్​కు మరోసారి బెదిరింపులు

సల్మాన్​ ఖాన్​కు మరోసారి బెదిరింపులు
  • రూ.2 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని వార్నింగ్

ముంబై :బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్​కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులివ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. 

అయితే.. ఎవరు బెదిరించారనేది ఇంకా తెలియలేదు. వరుస బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రత పెంచారు. తాజాగా వచ్చిన బెదిరింపులపై వర్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

 ఐపీసీ సెక్షన్ 354(2), 308(4) కింద కేసు రిజిస్టర్ చేశారు. కొన్ని రోజుల ముందు రూ.5 కోట్లు ఇవ్వాలని సల్మాన్​కు బెదిరింపులు వచ్చాయి.