
ముంబై: బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మరోసారి బెదిరింపులు వచ్చాయి. తాము చెప్పినట్లు చేయకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని పేర్కొంటూ సోమవారం ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్‌కు మెసేజ్ వచ్చింది. " సల్మాన్ ఖాన్ బతికి ఉండాలంటే.. కృష్ణ జింకను చంపినందుకు అతడు బిష్ణోయ్ గుడికి వెళ్లి దేవుడి ఎదుట క్షమాపణ చెప్పాలి లేదా రూ. 5 కోట్లు అయినా మాకు చెల్లించాలి. రెండూ చేయకపోతే మేం అతన్ని చంపేస్తాం. మా గ్యాంగ్ ఇంకా యాక్టివ్‌గానే ఉంది" అని మెసేజ్‌లో ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీనిపై అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ బెదిరింపు మెసేజ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడి పేరుతో వచ్చిందని తెలిపారు.