తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ ఎన్నో హామీలు ఇచ్చింది. భూమిలేని దళిత, గిరిజనులకు మూడెకరాలు ఇస్తామని ప్రకటించింది. ఇదే విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలోని 16వ పేజీలో స్పష్టంగా పేర్కొంది. దళితులకు అరకొరగా భూపంపిణీ జరిగినా.. ఇప్పటి వరకూ ఒక్క గిరిజనుడికీ ఎకరా భూమి కూడా పంచలేదు. గిరిజనులకు మూడెకరాల భూమి పంచే అంశం అసలు తమకే తెలియదని గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీనిని బట్టి గిరిజనులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవుతోంది.
ఉన్న భూములనే గుంజుకుంటున్రు
రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారు. సుమారు రెండు లక్షల మంది గిరిజన రైతులు పంటలను సాగు చేస్తున్నారు. గిరిజనులకు సర్కార్ ఇస్తామన్న భూములను అటుంచితే, వారు సాగు చేసుకుంటున్న పోడు భూములను అటవీ అధికారులు గుంజుకుంటున్నారు. 7.36 లక్షల ఎకరాల భూములు ఇతరుల అధీనంలో ఉన్నాయని, వాటిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర సర్కారు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అడవులకు దగ్గరలో ఉన్న పోడు భూముల్లో హరితహారం కింద మొక్కలు నాటాలని ఆదేశించింది. దీంతో హరితహారం పేరుతో వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుంటోంది. పట్టాలు ఉన్న భూములనూ అధికారులు లాక్కుంటున్నారు.
అధికార పార్టీ లీడర్ల ఆక్రమణలు
గిరిజనులు, ఆదివాసీల పోడు వ్యవసాయం ప్రత్యేకమైనది. అడవుల్లో వాలు గల ప్రాంతాల్లో ఉండే చిన్నపాటి పొదలు, మొక్కల్ని నరికి సేద్యానికి అనువుగా మలుచుకుంటారు. ఈ విధానంలో దుక్కి దున్నరు. నాగలికి ఎడ్లను కట్టరు. ఒక చిన్నపాటి పుల్ల(దీనిని ‘కచల్’ అంటారు)తో భూమిని లోతుకు పెళ్లగించి విత్తనాలు విత్తుతారు. వీరు వేసే పంటలు రాగులు, సజ్జలు, జొన్నలు మొదలైన చిరుధాన్యాలే. ఈ పంటలకు పూర్తిగా పశువుల పెంటనే ఎరువుగా వాడతారు. ఆదివాసీలు ఒకేచోట రెండు, మూడు పంటల కంటే ఎక్కువ సాగు చేయరు. చాలా సహజ పద్ధతుల్లో సాగే పోడు వ్యవసాయ విధానాల వల్ల అడవులకు, పర్యావరణానికి పూచిక పుల్లంత హాని కూడా జరగదు. ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పోడు భూముల విస్తీర్ణం భారీగా ఉంది. ఈ భూములపై కన్నేసిన ఆయా జిల్లాల్లోని అధికార పార్టీ నాయకులు ఆదివాసీలను మచ్చిక చేసుకుని, వారిని బినామీలుగా మార్చుకుని పోడు భూముల్ని చెరబట్టారు. గిరిజనుల పేరుతో తామే సాగు చేయడం మొదలుపెట్టారు. అసలైన పోడు వ్యవసాయానికి అర్థం మార్చేస్తూ అడ్డొచ్చిన మొక్కల్ని, చెట్లను నరికేస్తూ అడవులను మైదానాలుగా మార్చేసి సేద్యం చేయడం మొదలుపెట్టారు. వందల, వేల ఎకరాలు ఆక్రమించుకున్నారు. తెలంగాణలో మొత్తం అటవీ విస్తీర్ణం 26,90,370 హెక్టార్లు కాగా, ఇందులో 2,94,693 హెక్టార్ల భూమి ఆక్రమణల చెరలో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఏ జిల్లాలో ఎన్ని భూములు లాక్కున్నారంటే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖ అధికారులు 2,500 ఎకరాల్లో ప్లాంటేషన్ చేశారు. ఇందులో 1,500 ఎకరాలు పోడు భూములే. సాగులో ఉన్న 600 ఎకరాలను లాక్కున్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండేండ్లుగా 350 హెక్టార్లలో ఫారెస్ట్ ఆఫీసర్లు హరితహారం మొక్కలు నాటారు. గతేడాది జూన్ 30న కాగజ్ నగర్ మండలం సార్శాలలో 20 హెక్టార్ల పోడు భూమిలో ఫారెస్ట్ ఆఫీసర్లు పోలీస్ బందోబస్తు మధ్య మొక్కలు నాటేందుకు వెళ్లారు. ఘర్షణ చోటు చేసుకుంది. 35 మంది రైతులపై కేసు నమోదై, వారంతా జైలుకు వెళ్లి వచ్చారు.
నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 400 హెక్టార్లలో పోడు భూముల్లో ఫారెస్ట్ ఆఫీసర్లు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. మోపాల్ మండలం కాల్పోల్ గిరిజన తండాలో 54 గిరిజన కుటుంబాలు వంద ఎకరాల పోడు భూముల్లో సాగు చేస్తున్న మొక్కజొన్న, సోయా పంటలను ధ్వంసం చేశారు.
పెద్దపల్లి జిల్లాలోని మంథని ముత్తారం మండలాల్లో పోడు భూములు ఉండగా హరితహారం కార్యక్రమంలో అధికారులు మొక్కలు నాటుతున్నారు. మంథని మండలం గోపాల్‌పూర్‌లో 70 ఎకరాల్లో పేదలు గుడిసెలు వేసుకోగా, ఆఫీసర్లు గుడిసెలు తొలగించి హరితహారంలో మొక్కలు నాటారు.
భూ పట్టాలెటుపాయె?
‘పోడు భూముల సమస్యల పరిష్కారం మన చేతుల్లో ఉంటది. నేనే వచ్చి కూర్చుంటా. గిరిజన జిల్లాలకు ఆఫీసర్లను వెంటపెట్టుకొని వస్తా. పోడు భూముల లొల్లి ఎక్కడో ఓ కాడ అంతం కావాలె. గిరిజనుల భూములకు రైతుబంధు, హక్కులు రావాలె’ అని 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ దీనికి సంబంధించిన ప్రతిపాదనలే సిద్ధం కాలేదు. 2006లో ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోడు భూములకు ఫారెస్ట్ రైట్ యాక్ట్ హక్కు పత్రాలు అందించారు. 1,83,107 మంది దరఖాస్తు చేసుకుంటే 93,494 మందికి హక్కు పత్రాలు అందించారు. 80,890 అప్లికేషన్లను తిరస్కరించగా, 8,723 అప్లికేషన్లను పెండింగ్‌లో పెట్టారు. అప్పట్నుంచీ ఇప్పటివరకు ఒక్క గిరిజనుడికీ హక్కు పత్రాలు ఇవ్వలేదు. పట్టాలొస్తే రైతుబంధు వస్తుందని ఆశించిన గిరిజనులకు దీంతో నిరాశే ఎదురవుతోంది. -రాములు నాయక్,మాజీ ఎమ్మెల్సీ
మూడెకరాలు ఇయ్యలే గానీ.. ఉన్న భూములే గుంజుకుంటున్నరు
- వెలుగు ఓపెన్ పేజ్
- December 23, 2020
లేటెస్ట్
- IPL 2025 Mega Action: వేలంలో మెరిసిన SRH.. హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే
- ఈ సారి అంతంత మాత్రమే.. 2025 సీజన్ RCB పూర్తి జట్టు ఇదే
- US Probe Effect: అదానీతో వ్యాపారం రద్దు చేసుకున్న ఫ్రాన్స్ కంపెనీ
- మెగా వేలంలో 20 మందిని కొన్న చెన్నై.. నెక్ట్స్ సీజన్‌కు CSK ఫుల్ స్క్వాడ్ ఇదే
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- నార్మన్ పోస్టర్స్ సంస్థకు దక్కిన అమరావతి భవనాల డిజైన్ల టెండర్
- కారు డ్రైవర్ నిర్లక్ష్యం..ఆడుకుంటున్న చిన్నారి ప్రాణాలు తీసింది
- ఐపీఎల్ మెగా వేలంలో ఏపీ క్రికెటర్ల హవా.. ఆక్షన్‌లో ముగ్గురు సోల్డ్
- ఐపీఎల్ మెగా వేలంలో సంచలనం.. కోటీశ్వరుడైన 13 ఏళ్ల కుర్రాడు
- మాలల సింహా గర్జనకు పెద్దఎత్తున తరలిరావాలి: ఎమ్మెల్యే వివేక్
Most Read News
- Gold rate : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
- IND vs AUS: సుందర్ సర్ ప్రైజ్ డెలివరీ.. 140 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి
- IPL 2025 Mega Action: ఏడిస్తే 23 కోట్లు ఇచ్చారు.. కెప్టెన్సీ కూడా కావాలంట: కేకేఆర్ ప్లేయర్ డిమాండ్
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- Good Health : మీకు షుగర్ ఉందా.. అయితే ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి.. ఎనర్జీతోపాటు ఆరోగ్యం కూడా..
- బ్యాంకాక్ నుంచి విషపూరిత పాములు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుకున్న అధికారులు
- పారం కోళ్లలో డేంజర్ బ్యాక్టీరియా
- Aadhaar Card: ఆధార్ కార్డులో కరెక్షన్ రూల్స్ మరింత కఠినతరం..ఈ విషయం అందరూ తెలుసుకోవాల్సిందే
- తలుపులు మూసేసి రాత్రంతా దందా.. పాతబస్తీలో పోలీసుల ఆకస్మిక దాడులు
- కార్తీకమాసం.. నవంబర్ 26 ఏకాదశి.. పరమేశ్వరుడిని.. విష్ణుమూర్తిని ఇలా పూజించండి..