ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ క్రికెటర్లను అదృష్టం వరించింది. వచ్చే సీజన్ కోసం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతోన్న ఐపీఎల్ మెగా వేలంలో ఏపీకి చెందిన ముగ్గురు యువ క్రికెటర్ల సోల్డ్ అయ్యారు. గుంటూరుకి చెందిన షేక్ రషీద్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌కు కొనుగోలు చేసింది. అలాగే.. విజయవాడకు చెందిన యంగ్ క్రికెటర్ పైల అవినాష్‌ను రూ.30 లక్షల కనీస ధరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.
తూర్పు గోదావరికి చెందిన సత్యనారాయణ రాజు సైతం వేలంలో అమ్ముడుపోయాడు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్ వేలంలో నిలిచిన సత్యనారాయణ రాజును ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఈ ముగ్గురిలో షేక్ రషీద్ గత సీజన్లోనే ఐపీఎల్లో అరంగ్రేటం చేశాడు. ఇప్పుడు కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్సే లాస్ట్ సీజన్లో కూడా షేక్ రషీద్‌ను దక్కించుకుంది.
మిగిలిన ఇద్దరు ప్లేయర్స్ పైల అవినాష్, సత్యనారాయణ రాజు ఐపీఎల్‌కు సెలెక్ట్ కావడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన అరవెల్లి అవనీష్ రావు మెగా వేలంలో అమ్ముడుపోలేదు. భారత అండర్ 19 జట్టు తరుఫున ఆడిన ఈ యువ క్రికెటర్ ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజ్ ఇంట్రెస్ట్ చూపలేదు. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఐపీఎల్ 2025 మెగా వేలం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఆదివారం (నవంబర్ 24) ప్రారంభమైన మెగా వేలం సోమవారం (నవంబర్ 25) ముగియనుంది.