హైదరాబాద్లో ముగ్గురు మిస్సింగ్

మెహిదీపట్నం, వెలుగు: ఇంటి నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి తప్పిపోయిన ఘటన మంగళ్ హాట్ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై అస్లాం వివరాల ప్రకారం.. మంగళ్ హాట్ న్యూ ఇందిరానగర్ కు చెందిన ధనుష్ (13) గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో గోడే కబర్ కు చెందిన శిల్పా నిర్గడే (20) ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తోంది. ఈ నెల 14న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె తండ్రి మారుతి పోలీసులను ఆశ్రయించాడు.

ఇంటర్ విద్యార్థిని ..

జవహర్ నగర్: ఇంటర్ విద్యార్థిని మిస్సింగ్ అయింది.  జవహర్ నగర్ ఎస్సై రాములు వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా యాప్రాల్ ప్రాంతానికి చెందిన బాలిక (17) నగరంలోని ఓ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఈ నెల 22న కాలేజీకి వెళ్లి ఇంటికి తిరిగొచ్చింది. తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. అయితే, అదే రోజు రాత్రి 8 గంట లకు ఆమె తండ్రి ఇంటికి వచ్చేసరికి కుమార్తె కనిపించకపోగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.