నమ్మించి.. నిండా ముంచారు: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన మరో హైదరాబాదీ

నమ్మించి.. నిండా ముంచారు: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన మరో హైదరాబాదీ

హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల చేతిలో మరో హైదరాబాద్ వాసి మోసపోయాడు. అధిక లాభం వస్తుందని నమ్మించి నిండా ముంచారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు తాజాగా బెంగుళూరుకి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. బెంగుళూరుకి చెందిన- ఆర్‌కె భట్, షేక్ జైనాబ్ అలియాస్ నిహారిక, ఆమె భర్త అక్బర్ ఖాన్ ఆన్‌లైన్ పెట్టుబడి సంస్థ 'ఎక్స్‌టి స్క్వేర్ ఫైనాన్షియల్ సర్వీసెస్'లో పెట్టుబడులు పెడితే అధికా లాభాలు వస్తాయని హైదరాబాద్‎కు చెందిన ఓ వ్యక్తికి ఆశ చూపించారు. 

వీరి మాటలు నమ్మిన బాధితుడు పలు దఫాలుగా మొత్తం రూ. 1.45 కోట్లు పెట్టుబడి పెట్టారు. నెలలు గడుస్తోన్నప్పటికీ రూపాయి కూడా తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి శనివారం (అక్టోబర్ 26) బెంగుళూరుకి చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 

Also Read :- మన ఇంట్లో పని చేసే వంటవాడికి.. వాడి ఇంట్లో వంట మనిషి

ముగ్గురు నిందితులు పలు బ్యాంకు ఖాతాలను ఉపయోగించి భారీ మొత్తంలో డబ్బును ఇతరు అకౌంట్లకు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా ఆన్ లైన్‎లో పెట్టుబడులు పెట్టేవారికి సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సూచన చేశారు. పెట్టుబడుల సమయంలో భారీ రాబడిని ఆశ చూపే కంపెనీల పట్ల పౌరులు జాగ్రత్త  ఉండాలని.. తొందరపడి మోసపోవద్దని సూచించారు. హెల్ప్‌లైన్ 1930 లేదా వెబ్‌సైట్‌లో సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు.