డ్రగ్స్​ అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్​ 

డ్రగ్స్​ అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్​ 

కూకట్​పల్లి, వెలుగు: డ్రగ్స్​ అమ్ముతున్న  ముగ్గురు యువకులను కేపీహెచ్​బీ పోలీసులు  పట్టుకున్నారు.  సేల్స్​మెన్​గా పని చేస్తూ ఎల్లమ్మబండ పరిధిలోని పంచమికాలనీలో నివసించే కె.నాని(25), జగద్గిరిగుట్ట నివసిస్తూ రాపిడో డ్రైవర్​గా పని చేస్తున్న కుర్వ ప్రకాశ్​(30), మొబైల్​ షాపులో పని చేస్తున్న గాండ్ల నవీన్​కుమార్​(30) కొంతకాలంగా   డ్రగ్స్​ అమ్మడం ప్రారంభించారు. ఎల్లమ్మబండ ప్రాంతంలో నివసించే వరుణ్​(24) వద్ద వీరు బ్రౌన్​ షుగర్​ తక్కువ రేటుకు కొని,  ఇతర కస్టమర్లకు అమ్మతున్నారు.  

సమాచారం అందుకున్న పోలీసులు  విశ్వనాథ్​ థియేటర్​ సమీపంలో వీరిని పట్టుకున్నారు. వీరి నుంచి 2 గ్రామలు బ్రౌన్​ షుగర్​, ఒక బైక్​, నాలుగు సెల్​ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరికి డ్రగ్స్​ సరఫరా చేస్తున్న వరుణ్​ పరారీలో ఉన్నాడు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.