శంషాబాద్, వెలుగు: మైలార్ దేవ్ పల్లి పీఎస్పరిధిలోని కాటేదాన్అమ్మ గార్డెన్ సమీపంలో ఆదివారం గంజాయి అమ్ముతున్న ముగ్గురిని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 200 గ్రాముల గంజాయితో పాటు మూడు సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
జార్ఖండ్ నుంచి గంజాయి తీసుకువచ్చి, నగరంలో విక్రయిస్తున్నట్టు గుర్తించారు. నిందితుల్లో షేక్ ముషారఫ్ యాసీన్(23), ఇస్రాయెల్ అన్సారీ(20), మలాద్ మల్వాని, మంజూర్ మహబూబ్ సయ్యద్ (35) ఉన్నారు. ఇందులో ముగ్గురు పట్టుబడగా మైలార్దేవ్పల్లి పోలీసులకు అప్పగించారు.