కోదాడ, వెలుగు : కోదాడ లో గంజాయిని విక్రయించేందుకు తీసుకెళ్తున్న ముగ్గురిని బుధవారం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ రాము వివరాల ప్రకారం పట్టణానికి చెందిన అవిడి రాఘవ, ముడియాల వీర సాయి రెడ్డి, గంధం సునిల్ గంజాయికి అలవాటు పడ్డారు.
ఆంధ్రాలోని గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి, కోదాడ కు తెస్తున్నారు. దాంట్లోకి కొంత వీళ్లు సేవించి, మిగిలిన గంజాయిని పాకెట్స్ గా చేసి ఒక్కొక్క పాకెట్ ను రూ. 500లకు అమ్మతున్నారు.
ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఏపీలోని దాచేపల్లి నుంచి గంజాయి తీసుకొచ్చారు. దాన్ని అమ్మేందుకు బుధవారం తరలించారు. కోదాడలోని హుజూర్ నగర్ ఫ్లై ఓవర్ వద్ద పోలీసులు వారి వాహనాన్ని తనిఖీ చేయగా వీళ్లు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి అరకిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరిచినట్లు సీ ఐ తెలిపారు.