యువతి హత్య కేసులో ముగ్గురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

యువతి హత్య కేసులో ముగ్గురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • తల్లి, బావతో కలిసి ప్రియుడే చంపినట్లు నిర్ధారణ
  • హత్యకు ముందు లైంగిక దాడి చేసిన ప్రియుడు, అతడి బావ

మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో ఈ నెల 14న జరిగిన యువతి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. పెండ్లి చేసుకోవాలని నిలదీయడంతో యువతి ప్రియుడే కుటుంబ సభ్యులతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్యకు ముందు ఆమెపై ప్రియుడితో పాటు అతడి బావ సైతం లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. కేసులో ముగ్గురిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రాజశేఖరరాజు బుధవారం వెల్లడించారు. 

ఆయన తెలిపిన వివరాల ప్రకారం... దామరచర్ల మండలానికి చెందిన ఓ 19 ఏండ్ల యువతి, అదే మండలం పుట్టలగడ్డ తండాకు చెందిన రూపావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాగు రెండేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో యువతి రెండు సార్లు ప్రెగ్నెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడంతో అబార్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయించాడు. వీరి విషయం ఇంట్లో తెలియడంతో పెండ్లి గురించి మాట్లాండేందుకు యువతీ తల్లిదండ్రులు నాగు ఇంటికి వెళ్లారు. అయితే నాగుతో పాటు అతడి తల్లి పెండ్లికి నిరాకరించారు. ఈ విషయం తెలిసిన యువతి ఈ నెల 14న పుట్టలగడ్డ తండాలోని నాగు ఇంటికి వెళ్లి  పెండ్లి విషయమై నిలదీసింది. 

దీంతో ఊర్లో పరువు పోయిందని భావించిన నాగు, అతడి తల్లి బుజ్జి, బావ రమావత్ క్రాంతి కలిసి యువతిని హత్య చేసేందుకు ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ క్రమంలో మాట్లాడేందుకు తండాలోని మాలోతు దేశ్యాకు చెందిన వ్యవసాయ భూమి వద్దకు రావాలని యువతికి చెప్పడంతో ఆమె అక్కడికి వెళ్లింది. అక్కడ తల్లి బుజ్జి రోడ్డుపై కాపలా ఉండగా నాగుతో పాటు అతడి బావ క్రాంతి యువతిపై లైంగిక దాడి చేశారు. అనంతరం ముగ్గురు కలిసి యవతి గొంతు నులిమి హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చెట్టుకు వేలాడదీశారు. 

ఈ విషయంపై కేసు నమోదు కాగా ఎంక్వైరీ చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రెండు బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు, కండువాను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను పట్టుకున్న మిర్యాలగూడ రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఐ వీరబాబు, వాడపల్లి ఎస్సై ఇరుగు రవిని డీఎస్పీ అభినందించారు.