![మల్క కొమురయ్యకు మరో మూడు సంఘాల మద్దతు](https://static.v6velugu.com/uploads/2025/02/three--associations-support-malka-komuraiah-in-mlc-elections_Ss0NgV8OZA.jpg)
- బీజేపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామన్న ఏటీఏ, టీఆర్టీయూ, టీఎస్టీసీఈఏ
హైదరాబాద్, వెలుగు: కరీంనగర్–మెదక్– నిజామాబాద్–ఆదిలాబాద్ టీచర్ సెగ్మెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యకు మరో మూడు సంఘాలు మద్దతు ప్రకటించాయి. హైదరాబాద్లో ఆయనను తెలంగాణ ఆదివా సీ టీచర్స్ అసోసియేషన్(ఏటీఏ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మేస్రం గంగారం, కల్లూరి జయబాబు, తెలంగాణ రీజినల్ టీచర్స్ యూనియన్(టీఆర్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగేశ్ యాదవ్ కలిసి మద్దతు లేఖలను అం దించారు.
అలాగే, తెలంగాణ స్కూల్స్ టెక్నిక ల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఎస్టీసీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్ కుమార్.. కొమురయ్యకు మద్దతు ప్రకటించారు. టీచర్లు, లెక్చరర్లు కొమురయ్యకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. టీచర్లు, లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి మండలిలో పోరాడుతారనే విశ్వాసంతోనే ఆయనకు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. బీసీ బిడ్డను మండలికి పంపించాలని వారు టీచర్లకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కొము రయ్యకు తపస్, బీసీటీఏ, టీపీటీయూ, టీసీపీఎస్ఈఏ, టీపీఈయూ తదితర సంఘాలు మద్దతిచ్చిన విషయం తెలిసిందే.